ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACCIDENT : జీపు బోల్తా...ఇద్దరు మృతి - jeep accident in manyam

విశాఖపట్నం జిల్లా మన్యంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

జీపు బోల్తా...ఇద్దరు మృతి
జీపు బోల్తా...ఇద్దరు మృతి

By

Published : Jan 13, 2022, 7:03 PM IST

విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని కడుగుల నుంచి కొయ్యూరు మండలం చింతవానిపాలేనికి వెళ్తున్న జీపు.. బొంతువలస ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కొయ్యూరు మండలం చింతవానిపాలెం గ్రామానికి చెందిన దేవుడు, చిట్టిబాబు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో పది మంది ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details