ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్రమ అరెస్టులు ఆపండి... ఆ ఇద్దరినీ విడుదల చేయండి' - ఆంధ్రా ఒడిశా సరిహద్దు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పెదబయలు మండలం ననిబరి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గిరిజనులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.

tribals protests condemning police activities
tribals protests condemning police activities

By

Published : Sep 1, 2020, 5:59 PM IST

విశాఖ జిల్లా పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. అక్రమ అరెస్టులు ఆపాలని, గిరిజనులపై దాడులు కట్టడి చేయాలని నినాదాలు చేశారు. పెదబయలు మండలం ననిబరిలో ఆందోళన చేసిన గిరిజనులు... తమ గ్రామానికి చెందిన అప్పారావు, మల్లేశ్వరరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరికీ ఏదైనా జరిగితే పోలీసులే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details