ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Attack: గంజాయి పంట ధ్వంసం చేసేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనుల దాడి

విశాఖ మన్యంలో గంజాయి పంట ధ్వంసానికి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు, అధికారులపై స్థానిక గిరిజనులు తిరగబడ్డారు. కర్రలతో అధికారులను బెదిరించి బైకులు ధ్వంసం చేశారు. గిరిజనులు ఎదురుతిరగటంతో గంజాయి పంట ధ్వంసం చేయకుండానే పోలీసులు వెనుదిరిగారు.

పోలీసులపై గిరిజనుల దాడి
పోలీసులపై గిరిజనుల దాడి

By

Published : Nov 2, 2021, 5:25 PM IST

Updated : Nov 3, 2021, 7:45 AM IST

విశాఖ మన్యంలో గంజాయి పంట ధ్వంసానికి వెళ్లిన ఎక్సైజ్ అధికారులు, పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. జి.మాడుగుల మండలం బోయితలి పంచాయతీ పరిధిలో గంజాయి తోటలు ధ్వంసం చేస్తుండగా స్థానిక గిరిజనులు వారిపై దాడికి యత్నించారు. కర్రలు, రాళ్లతో అధికారులను భయబ్రాంతులకు గురి చేసి ద్విచక్రవాహనాలను ధ్వసం చేశారు. ఇక్కడి నుంచి వెళ్లక పోతే జీపులను తగులబెడతామని హెచ్చరించారు.

పోలీసులపై గిరిజనుల దాడి

జి.మాడుగుల సీఐతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాజీరావు నచ్చజెప్పినప్పటికీ గిరిజనలు వినిపించుకోలేదు. తమ గ్రామాలకు రావద్దంటూ వారితో వాగ్వాదానికి దిగారు. గిరిజనులు ఎదురుతిరగటంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

పోలీసుల ప్రకటన..

ఈ ఘటనపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. తొలుత గిరిజనులు అడ్డుకున్నప్పటికీ.. తర్వాత వారికి నచ్చజెప్పామని వెల్లడించారు. సుమారు 107 ఎకరాల్లో సాగు చేసిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

DGP On Drugs: ఏపీలో డ్రగ్స్ లేవు: డీజీపీ

Last Updated : Nov 3, 2021, 7:45 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details