ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం.. మూడు పూరిళ్లు దగ్ధం - విశాఖ అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధం

అగ్ని ప్రమాదానికి విశాఖ జిల్లా బుచ్చెయ్యపేటలో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. నిలువ నీడలేక వారు రోడ్డున పడ్డారు. లక్షలాది రూపాయలు ఆహుతయ్యాయి. అగ్నిమాపక శకటం వచ్చి.. మంటలను అదుపులోకి తీసుకు వచ్చింది.

fire accident in visakha
దగ్ధమవుతున్న పూరిళ్లు

By

Published : Oct 27, 2020, 10:21 PM IST

ప్రమాదవశాత్తు విశాఖ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం.. మూడు కుటుంబాలను రోడ్డున పడవేసింది. బుచ్చయ్యపేట మండలం మల్లాంకు చెందిన మురిగిటి పెదరాజు, చినరాజు, కల్యాణం కుటుంబాల పూరిళ్లు దగ్ధమయ్యాయి. 1.75 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

ఈ ఘటనలో రెండున్నర తులాల బంగారం, 45 తులాల వెండి, వ్యవసాయ భూమి దస్తావేజులు, బ్యాంక్ పుస్తకాలు కాలిపోయాయని బాధితులు తెలిపారు. రావికమతం నుంచి అగ్నిమాపక శకటం వచ్చి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటమే కాస్త ఊరటనిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details