కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే నియమ, నిబంధనలనను మరింత కఠినతరం చేసింది. మాస్క్ లేకపోతే రైల్వే స్టేషన్లోకి అనుమతిని నిరాకరిస్తామని స్పష్టం చేసింది.
నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి..
బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు 72 గంటలకు చెల్లుబాటు అయ్యే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టును తప్పని సరిచేసినట్లు వివరించింది. దూర ప్రాంత ప్రయాణికులు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.
రైలు ఎక్కేటప్పుడు గుమిగూడవద్దు..
స్టేషన్లు, రైళ్లలో చెల్లుబాటు అయ్యే రిజర్వ్డ్ టిక్కెట్లతో ఉండాలని, మాస్క్లు ధరించాలని, రిజర్వేషన్ కౌంటర్లు, రైలు ఎక్కేటప్పుడు గుమిగూడి ఉండరాదని స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించడం, ఆరోగ్య నియమావళి తనిఖీ కోసం రైల్వే సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
పలు రైళ్లు రద్దు..
విశాఖ-కిరండల్, భువనేశ్వర్-జగదల్పూర్, తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్, సికింద్రాబాద్- విశాఖ, విశాఖ-రాయపూర్, సంబల్పూర్- రాయగడ రైళ్లను ఈ నెలాఖరు వరకు రద్దు చేశామని వివరించింది.
ఇవీ చూడండి :పోలవరంతో తెలంగాణలో ముంపు ఉండదు.. ఏపీ స్పష్టీకరణ