అనకాపల్లి రింగ్‌రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది. కోరిబిల్లి హరికృష్ణచైతన్య కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 13వ తేదీన నర్సీపట్నం వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు చైతన్యకు సమాచారం ఇచ్చారు. ఎనిమిదిన్నర తులాల బంగారు వస్తువులు, ఇరవై వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ క్రైం ఎస్సై తెలిపారు.
అపార్ట్మెంట్లో దొంగతనం.. రంగంలోకి పోలీసులు - Theft in the apartment news
విశాఖ జిల్లా అనకాపల్లి రింగ్‌రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అపార్ట్మెంట్లో దొంగతనం