విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలోని నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో... జలాశయం గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... సోమవారం సాయంత్రానికి 379 అడుగులకు చేరింది. జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమై నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతం నుంచి నీటి నిల్వలు ఉద్ధృతంగా చేరడంతో... ముందస్తుగానే స్పిల్ వే రెగ్యులేటర్ మూడు గేట్ల నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.