ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CAR HIT THE POLE: బాలుడి డ్రైవింగ్‌.. అదుపుతప్పిన కారు.. ఒకరు మృతి

By

Published : Sep 28, 2021, 11:26 AM IST

Updated : Sep 29, 2021, 6:44 AM IST

car hits telephone pole at vishaka
నర్సీపట్నంలో కారు బీభత్సం.. వాహనం నడిపిన బాలుడు

11:22 September 28

కారు నడిపిన మైనర్​

నర్సీపట్నంలో కారు బీభత్సం.. వాహనం నడిపిన బాలుడు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ విద్యార్థి నడిపిన కారు నిత్యం రద్దీగా ఉండే ఐదురోడ్ల కూడలిలో మంగళవారం ఉదయం అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సాంఘిక సంక్షేమ శాఖ విశ్రాంత ఉద్యోగి రుత్తల చిన అయ్యన్నపాత్రుడు (65) తలకు తీవ్రంగా గాయమైంది. విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించారు. స్థానిక సంక్షేమ వసతిగృహంలో భోజన తయారీదారు (కుక్‌)గా పనిచేసి పదవీ విరమణ చేసిన అయ్యన్నపాత్రుడు పొలానికి వెళ్లి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. జిల్లా పరిషత్తు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇదే ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై దివాకర్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ‘నర్సీపట్నానికి చెందిన బాలుడు (17) విశాఖపట్నంలోని ఓ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు. కారు నడుపుతూ బ్రేకుకు బదులు క్లచ్‌ తొక్కడంతో వాహనం అదుపు తప్పి దూసుకుపోయింది. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నాం. అయినా వాహనాలు ఇస్తూనే ఉన్నారు’అని పేర్కొన్నారు.   

అతను బీభత్సం సృష్టించాడు. కారు అదుపు తప్పి నాలుగు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. ఘటనలో నలుగిరికి గాయాలుకాగా.. వారిని ఆసుపత్రికి తరలించాం. బాలుడిని డిటైన్ చేసి.. దర్యాప్తు చేపట్టాం. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నాం. అయినా వాహనాలు ఇస్తూనే ఉన్నారు.  -దివాకర్, నర్సీపట్నం టౌన్ ఎస్సై

ఇదీ చదవండి: 

Sajjala: 'మంచి చేయాలని చూస్తున్నాం.. బురద చల్లాలని చూస్తే పవన్​కే ఇబ్బంది'

Last Updated : Sep 29, 2021, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details