ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

స్నేహితులతో పాటు ఆ విద్యార్థి కూడా సంక్రాంతి సెలవులకు వెళ్లాడని అందరూ అనుకున్నారు. కానీ వసతి గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన విశాఖ మన్యం కొయ్యూరు గురుకుల పాఠశాలలో జరిగింది.

tenth student committed suicide
వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

By

Published : Jan 12, 2021, 2:25 PM IST

విశాఖ మన్యం కొయ్యూరు మండల కేంద్రం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాడేరు మండలం గురుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి... కొయ్యూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల విద్యార్థులంతా సంక్రాంతి సెలవులకని స్వగ్రామాలకు వెళ్లారు. సదరు విద్యార్థి కూడా సెలవులకు ఇంటికి వెళ్తున్నట్లు రిజిష్టర్​లో సంతకం చేశాడు.

ఉదయం పాఠశాల వాచ్​మెన్ వసతి గృహాల గదులకు తాళాలు వేస్తుండగా... వసతి గదిలో విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. విషయాన్ని ప్రిన్సిపల్​ శ్రీనివాసరావుకు తెలియజేశారు. ప్రిన్సిపల్ కొయ్యూరు పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. విద్యార్థి మృతదేహానికి పంచనామా నిర్వహించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details