విశాఖ జిల్లా మాడుగుల మండంలం ఎం. కోటపాడులో దళితులు రోడెక్కారు. తమ వర్గానికి చెందిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని ఆందోళన చేశారు. ఎన్నిసార్లు అధికారులకు మోర పెట్టుకున్నా.. పట్టించుకోలేదని ఆగ్రహించారు.
ఇటీవల వ్యక్తి మృతి చెందగా సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కారణంగా.. వివాదాన్ని తక్షణం పరిష్కరించాలంటూ దళితులు రోడ్డెక్కారు. ఈ కారణంగా పాడేరు మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకొని సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా వారు ఆందోళన విరమించారు.