లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా అత్యవసర పరిస్థితులు, వ్యాపార నిమిత్తం, స్వచ్ఛంద సేవకులు, ఇతర అవసరాల నిమిత్తం విశాఖ జిల్లా పరిధిలోగాని, ఇతర జిల్లా, రాష్ట్రాలకు వెళ్లడానికి ఈ-పాస్‌లు ఇవ్వనున్నారు. దీనికోసం ముందుగా పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలకు వ్యక్తిగతంగా గాని, వాహనాలతో వెళ్లేవారు జిల్లా పోలీసు కార్యాలయ వాట్సాప్ నంబర్ 9505200100, 9440904229లకు దరఖాస్తు పంపాలి. లేకుంటే commandcontrolvspr@gmail.com కు మెయిల్ చేయవచ్చు. దరఖాస్తుదారుని పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, దరఖాస్తుదారుడు ఉండే పోలీస్ స్టేషన్ పరిధి, ఎవరెవరు వెళుతున్నారో వారి వివరాలు, ఎక్కడికి వెళుతున్నారు?, ఎన్ని రోజులకు అనుమతి కావాలనే తదితర విషయాలను తప్పనిసరిగా దరఖాస్తులో పొందుపర్చాలి. వాటిని పోలీసులు పరిశీలించి మీ ప్రయాణం అవసరమని.. మీ అభ్యర్థన నిజమేనని రుజువైన తర్వాత తాత్కాలిక పాసులను దరఖాస్తుదారుని వాట్సాప్ నంబర్, మెయిల్ ఐడీలకు పంపించడం జరుగుతుందని ఎస్పీ అట్టాడ బాబూజీ తెలిపారు. ఇతర వివరాల కోసం (0891) 2791186 కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.
అత్యవసర ప్రయాణానికి ఆన్‌లైన్‌లో అనుమతి - Temporary vehicle passes in visakha
లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. విశాఖ జిల్లాలోని పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా పోలీసు కార్యాలయ వాట్సాప్ నంబర్ 9505200100, 9440904229లకు దరఖాస్తు పంపాలని.... లేకుంటే commandcontrolvspr@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది.
ఆన్‌లైన్‌లో ఎమర్జెన్సీ వెహికల్ పాస్