మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్‌కు మతిస్ధితిమితం లేదని చిత్రీకరించడం దారుణమని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ప్రభుత్వానికి మతిస్థిమితం లేదని ఆయన విమర్శించారు. డాక్టర్ సుధాకర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. చికిత్సపై డాక్టర్ సుధాకర్ తీవ్ర సందేహం వ్యక్తం చేస్తున్నారని, ఆయనను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వచ్చినట్టు ఎమ్మెల్యే రామకృష్ణబాబు, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వివరించారు. ఆయనను ఎందుకు ఆసుపత్రిలో ఉంచారో ఇప్పటికీ తెలియడం లేదని సందేహం వ్యక్తం చేశారు.
'సుధాకర్‌కు కాదు.... ప్రభుత్వానికి మతిస్థిమితం లేదు' - డాక్టర్ సుధాకర్ తాజా వార్తలు
డాక్టర్ సుధాకర్‌ను తెదేపా ఎమెల్యే వెలగపూడి రామకృష్ణ, వంగలపూడి అనిత పరామర్శించారు. సుధాకర్‌కు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. బాగా మాట్లాడుతున్న ఆయనను ఆసుపత్రిలో ఉంచడమేంటని ప్రశ్నించారు.
vangalapudi anitha