విశాఖ జిల్లా కశింకోట మండలం గొబ్బూరు గ్రామంలో వలస కూలీలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదగా అందజేశారు. వలస కూలీలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. చంద్రన్న భీమాను పునరుద్ధరించాలని కోరారు.
వలస కూలీలకు తెదేపా ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు వార్తలు
వలస కూలీలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదగా వలస కూలీలకు భోజన ప్యాకెట్లను అందజేశారు.
వలస కూలీలకు తెదేపా నేతల ఆహార పంపిణీ