PALLA SREENIVASARAO : విశాఖ గర్జనకు ప్రజా మద్దతు లేదని తేలిపోయిందని విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. మూడేళ్లుగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా.. వైకాపా సవతి ప్రేమ చూపుతుందనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు.
విశాఖ గర్జనకు ప్రజా మద్దతు లేదని తేలిపోయింది: పల్లా - garjana
TDP ON VISAKHA GARJANA : విశాఖ గర్జనలో పాల్గొనాలని విద్యార్థులను, ఉద్యోగులను ఒత్తిడి చేశారని.. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొంత మంది ఉద్యోగులు, ప్రొఫెసర్లు విశాఖ గర్జనలో పాల్గొన్నారని చెప్పారు.
ఒక్క ఛాన్స్ అని ప్రజలు అధికారం ఇస్తే.. మూడు సంవత్సరాలు అభివృద్ధిని ఆపేసి కొత్తగా విశాఖ రాజధాని అని చెప్పి వారి భావోద్వేగాలతో ఆడుకుంటున్న విషయం ప్రజలకు తేటతెల్లమైందన్నారు. విశాఖ గర్జనలో పాల్గొనమని విద్యార్థులను, ఉద్యోగులను బలవంతం చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఉద్యోగులు, ప్రొఫెసర్లు విశాఖ గర్జనలో పాల్గొన్నారని చెప్పారు. మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు, జీవీఎంసీ ఉద్యోగులు కూడా ర్యాలీలో పాల్గొన్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: