ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ గ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నాయకులు, కార్యకర్తలు.. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

tdp Foundation Day celebrations at visakha
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడకలు

By

Published : Mar 29, 2021, 4:38 PM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విశాఖలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో గోపాలపట్నంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజల కష్టాలు తీరుతాయని ఎమ్మెల్యే అన్నారు.

మాడుగుల నియోజకవర్గంలో...

నీతి నిజాయితీ కలిగిన తెదేపాతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని మాడుగుల నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జీ గవిరెడ్డి రామానాయుడు అన్నారు. కె.కోటపాడులో జరిగిన ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న ఆయన.. పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి సత్యనారాయణ అన్నారు. చీడికాడలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలో ఆయన మఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యకర్తలు.. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని కొనియాడారు. మాడుగుల, దేవరాపల్లిలో పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చోడవరం....

చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెదేపా రాకతో నూతన రాజకీయాలకు నాంది పలికిందని మాజీ ఎమ్మెల్యే కెఎస్​ఎన్​ఎస్ రాజు అన్నారు. బంగారుమెట గ్రామంలోని ఏన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు.

పాయకరావుపేట..

పాయకరావుపేటలో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వై జంక్షన్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నక్కపల్లిలో పేదలకు బట్టలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్నదానాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.

భీమునిపట్నం నియోజకవర్గంలో...

భీమునిపట్నం నియోజకవర్గంలో తెదేపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. భీమిలిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు.. కేక్​ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. స్థానిక 2, 3వ వార్డుల్లో పార్టీ నాయకులు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలో పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

'చంద్రబాబు వల్లే ప్రపంచపటంలో రాష్ట్రానికి గుర్తింపు'

ABOUT THE AUTHOR

...view details