ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వనిధి... వ్యాపారానికి పెన్నిధి

కేంద్రం అమలు చేస్తోన్న ఆత్మనిర్భర్‌ అభియాన్‌ పథకం(స్వనిధి) కింద ఒక్కో వీధి వ్యాపారి రూ.10 వేల బ్యాంకు రుణం పొందవచ్ఛు. దీనికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. తీసుకున్న రుణం 12 నెలల్లో వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వడ్డీని భరిస్తుంది. రోజువారీ వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్న వీరికి మంచి రోజులు రానున్నాయి. విశాఖ జిల్లాలో జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం పురపాలికల పరిధిలో సుమారు 17 వేల మంది వీధి వ్యాపారులున్నారు. ఇప్పటికే వీరిలో కొందరికి గుర్తింపు కార్డులు అందాయి. త్వరలోనే బ్యాంకుల నుంచి రూ.10 వేల చొప్పున రుణాలు ఇప్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

swanidi=hi help to road vendors at vishaka district
వీధి వ్యాపారులకు స్వనిధి

By

Published : Oct 3, 2020, 8:54 AM IST

కరోనాతో అన్ని రంగాలూ కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌తో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. రోడ్డు పక్క వ్యాపారులపై కూడా దీని ప్రభావం పడింది. వీరికి ప్రస్తుతం స్వనిధి పథకం అక్కరకు వస్తోంది. ప్రతి వ్యాపారికి రూ.10వేలు ఇస్తారు. ఈ సొమ్ముతో వ్యాపారం చేసుకుని నెలకు కొంత సొమ్ము వాయిదాగా చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల వడ్డీ వ్యాపారుల సమస్య నుంచి వీరికి విముక్తి కలుగుతుంది.

వీధి వ్యాపారులకు స్వనిధి

నర్సీపట్నం మున్సిపాలిటీలో గత ఏడాది వీధుల్లో తిరిగే చిరు వృత్తులతో జీవనం సాగించే 480 నందిని మెప్మా అధికారులు గుర్తించారు. వీరితో పాటు ఈ ఏడాది కొత్తగా ఎంపిక చేసిన 580 మందిని కలిపి మొత్తం 1060 మందికి గుర్తింపు కార్డులు సైతం అందజేశారు. వీరిలో ఈ పథకానికి 520 మందిని అర్హులుగా నిర్ధరించారు.

మెప్మా గుర్తింపు పొందిన వీథి విక్రయదారులందరూ స్వనిధి కింద బ్యాంకు రుణాలు పొందవచ్ఛు ఎవరైతే ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారో వారికి పది రోజులలోపు రుణాలు మంజూరవుతాయి.

విశాఖ జిల్లాలో వీధి వ్యాపారుల వివరాలిలా..

జీవీఎంసీ పరిధిలో 15,760 ఎలమంచిలిలో

600

నర్సీపట్నంలో 1,060

ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం

ABOUT THE AUTHOR

...view details