ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టైరీన్ గ్యాస్... ఇది చాలా ప్రమాదకరం!

విశాఖలో విషాదానికి కారణం స్టైరీన్ గ్యాస్. ఇది చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ వాయువు పీల్చితే చర్మంపై మంట, కళ్లల్లో నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస ద్వారా అది శరీరంలోకి వెళితే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుందని చెబుతున్నారు.

styrene gas symptoms
స్టైరీన్ గ్యాస్... ఇది చాలా ప్రమాదకరం!

By

Published : May 7, 2020, 11:51 AM IST

Updated : May 7, 2020, 4:53 PM IST

స్టైరీన్ గ్యాస్... ఇది చాలా ప్రమాదకరం!

విశాఖలో విషాదానికి కారణమైన స్టైరీన్ రసాయన గ్యాస్‌ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... మండే స్వభావం ఉన్న ఈ గ్యాస్‌.. చాలా త్వరగా గాలిలో కలసిపోయి అంతటా కమ్మేస్తుంది. ఒకవేళ ఆ వాయువును మింగినా, అది కలిసిన గాలిని పీల్చినా తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు.

చర్మంపై మంట, ఇన్‌ఫెక్షన్లు, కళ్ల ఎర్రబారి నీరు కారటం సాధారణంగా కనిపించే లక్షణాలు. శ్వాస ద్వారా అది శరీరంలోకి ప్రవేశిస్తే మాత్రం ఊపిరి తీసుకోవటానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువ సమయంలో వాయువు ప్రభావానికి లోనైతే మాత్రం శరీరంలోని మిగిలిన అవయవాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంలోనూ పర్యవసనాలు వెంటాడతాయి.

తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్టైరీన్ వాయువు బారిన పడిన వారిని సాధ్యమైనంత త్వరగా ఆ ప్రదేశం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి. ముందుగా గ్యాస్‌ బారినపడిన వ్యక్తి వస్త్రాలు పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన బట్టతో శరీరాన్ని కప్పి ఉంచి ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూసుకోవాలి. అపస్మారక స్థితికి చేరినా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

సహాయ చర్యల్లో పాల్గొనే వారు కూడా అన్ని విధాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరి తీసుకోవటం కోసం శ్వాస సహాయ వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా కలుషిత రసాయనాలు శుద్ధి చేసే వ్యర్థ జలాలు, మురుగునీటి కాల్వలకు చాలా దూరంగా ఉండాలి.

ఇవీ చదవండి:

గ్యాస్ లీకేజేతో 300 మందికి అస్వస్థత: కలెక్టర్‌

Last Updated : May 7, 2020, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details