ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజాయితీ చాటాడు..పోలీసులచే శభాష్ అనిపించుకున్నాడు

ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన నిజాయితీని చాటుకొని.. పోలీసుల చేత శభాష్ అనిపించుకున్నాడు. రోడ్డుపై దొరికిన డబ్బును ఖర్చు చేయకుండా పోలీసులకు అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

పోలీసులచే శభాష్ అనిపించుకున్న విద్యార్థి !

By

Published : Sep 13, 2019, 2:57 PM IST

ఎవరికైనా రూపాయి దొరికతే చాలు దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తారు. కానీ ఆ విద్యార్థి మాత్రం దొరికిన డబ్బను సరాసరి పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రవీణ్ కుమార్ స్కూల్​కు వెళ్లే మార్గంలో 2 వేల రూపాయల నోటు దొరికింది. దానిని తీసుకొన్న ఆ బాలుడు స్థానిక పోలీసు స్టేషన్​కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. ప్రవీణ్ కుమార్ నిజాయతీ చూసి ఎస్సై ఆశ్చర్యపోయాడు.. అనంతరం అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details