ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు విశాఖకు రానున్నారు. నేటి నుంచి 13 వరకు పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు నగరానికి చేరుకుంటారు. పర్యటనలో భాగంగా.. సెంట్రలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థను సందర్శిస్తారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖికి హాజరవుతారు. సాగర్ నగర్ లోని నివాసానికి వెళ్తారు. వర్చవల్ సమావేశాలకు హాజరవుతారు. వారం రోజుల పర్యటన అనంతరం.. తిరిగి ఈ నెల 13న దిల్లీకి ఉప రాష్ట్రపతి తిరుగు ప్రయాణమవుతారు.
ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సోమవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. ఉపరాష్ట్రపతి విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకోనే సమయంలో కొన్ని మార్గాల్లో ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రజలు ఆ సమయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.