విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి నియామక పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని ఉక్కు కార్మాగార యూనియన్ నేతలు కోరారు. విశాఖలోని గాజువాక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు అయోధ్యరాము మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జూనియర్ ట్రైనీలకు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా 13 చోట్ల నిర్వహించడం దారుణమన్నారు. నిర్వాసితులకు 50 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ ఉక్కు సంస్థ యాజమాన్యం అనైతిక ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరారు.
"ఉక్కు పరీక్షను రాష్ట్రంలోనే నిర్వహించాలి" - citu
విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన నియామక పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని గుర్తింపు సంఘం నేతలు డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్