విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయంలో.. జూన్ 1వ తేదీ నుంచి మరో రెండు గంటల పాటు భక్తులకు దర్శన సమయాన్ని దేవస్థానం పెంచింది. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వామిని దర్శించుకోవాలని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. అలాగే ఒకటో తేదీ నుంచి స్వామి వారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ప్రారంభిస్తున్నామని.. మంగళవారం నుంచి అమ్మకాలు జరుపుతామని తెలిపారు. కరోనా నిబంధనల కారణంగా.. స్వామివారి ప్రసాదం అమ్మకాలు నిలుపుదల చేశారు.
సింహాద్రి అప్పన్న ఆలయ దర్శన సమయం పొడిగింపు
విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి మరో రెండు గంటల పాటు దర్శన సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. జూన్ 1నుంచి ఉదయం 7.30 నుంచి 11 .30.గంటల వరకు.. కరోనా నిబంధనల నడుమ స్వామిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు.
simhachalam
TAGGED:
సింహాచలం ఆలయం వార్తలు