ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుచ్చి గుచ్చి గుల్లబరుస్తున్నాం... ప్రకృతికి హాని చేస్తున్నాం...

పర్యావరణ పరిరక్షణలో చెట్లతో కీలక పాత్ర. అలాంటి చెట్ల ప్రాణం తీస్తూ...మానవ జీవితాన్ని ప్రశ్నార్ధకం చేసుకుంటున్నాము. విచ్చలవిడిగా చెట్లు నరుకుతూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాం. చిన్నచిన్న తప్పులతోనే పెద్ద విపత్తు కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా ఉచిత ప్రకటనల కోసం ప్రయత్నించే క్రమంలో చాలా మంది చేసే చిన్న తప్పు... వృక్షాల ఆయువు తీస్తోంది.

Screw put on trees at vishakapatnam .it wii be effect on trees cell system

By

Published : Sep 4, 2019, 11:36 AM IST

గుచ్చి గుచ్చి గుల్లబరుస్తున్నాం... ప్రకృతికి హాని చేస్తున్నాం...

ప్రకటనల స్వార్థానికి వృక్షాలు బలి..
కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న పట్టణాలలో అక్కడ అక్కడ చెట్లు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఆ ఉన్న చెట్లనీ మేకులతో, కరెంట్ తీగలతో వాటి కణవ్యవస్థను నాశనం చేస్తున్నారు. నలుగురూ చూసేందుకు అనువుగా ఉంటుందని,.. ఉచితంగా టాక్స్ కట్టక్కర్లేకుండా చిన్నబోర్టు, రేకు, మేకులతో కొట్టి చెట్టు ప్రాణం తీస్తున్నారు. వందేళ్లకుపైబడి పెరగాల్సిన చెట్టు కూడా త్వరగా డొల్లగా, నిర్జీవంగా మారుతోంది. జైలమ్, దారుకణాలకు పోషకాలు అందక. కణమధ్యభాగం దెబ్బతింటుంది.దీంతో చెట్టు ఎండిపోతుంది.

వీటిపై అవగాహన తప్పనిసరి..
చెట్టుకు మేకులు కొట్టొద్దని చెప్పడానికే పర్యావరణవేత్తలు, స్వచ్చంద సంస్థలు నిరంతరాయంగా యత్నిస్తూనే ఉన్నాయి. చెట్టుకు మేకులు కొట్టినవారికి వెయ్యి రూపాయిల వరకు జరిమానా విధిస్తోంది ఒడిశాలోని బరంపురం మున్సిపల్ కార్పోరేషన్. విజయవాడ,విశాఖపట్నం,గుంటూరు, రాజమహేంద్రవరం వంటి నగరాల్లోనూ ఈ సమస్య తీవ్రత నానాటికి పెరిగిపోతోంది.

చిన్నదేశంగా ఉన్న బంగ్లాదేశ్‌లో ఓ సామన్య రైతు ఈ వృక్షాలకు జరుగుతున్న నష్టాన్ని నివారిండానికి శ్రమిస్తున్నాడు. మేకులను తొలగించి అక్కడ పడిన రంధ్రంలో ఓ మిశ్రమం ఉంచి చెట్లు కాపాడుతున్నాడు. ఇలా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడితే వాటి ఆయుష్సు పెంచినవాళ్లమవుతాం. చెట్లు నాటకపోయినా పర్వాలేదు... మేకులు కొట్టి చంపొద్దంటున్నారు పర్యావరణవేత్తలు.

ABOUT THE AUTHOR

...view details