కరోనా కారణంగా గత మార్చిలో మూతపడిన ప్రాథమిక పాఠశాలలు 11 నెలల అనంతరం తెరుచుకున్నాయి. చాలాకాలంగా పాఠశాల మూసి ఉండటం వల్ల తొలిరోజు విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. విశాఖ జిల్లా ఎలమంచిలి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు.. ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.
అచ్యుతాపురం, అనకాపల్లి, రాంబిల్లి మండలాల్లో విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలు తెరవటం వల్ల తరగతి గదులు బూజు పట్టాయి. విద్యార్థులు రాకపోవటంతో పాఠశాలలు బోసిపోయాయి. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలు తెరవాలని ఆదేశాలు జారీ చేయటంతో.. పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించటం లేదు.