విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో శానిటేషన్ స్ప్రే క్యాబిన్‌ను... స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తున్న 'ప్రగతి భారతి ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఈ క్యాబిన్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి రోజూ అధిక సంఖ్యలో రోగులు వస్తున్న నేపథ్యంలో వారి కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు.
జిల్లాలోని కశింకోట మండలం చింతలపాలెం ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామీణ జిల్లాలోని ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించేలా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఆయన రాపిడ్ టెస్ట్ పరీక్ష చేయించుకోగా.... కరోనా నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.