ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం చొరవతో తుమ్మపాల ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలు చెల్లింపు - ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తాజావార్తలు

విశాఖలోని తుమ్మపాల ఫ్యాక్టరీ కార్మికుల వేతన బకాయిలు చెల్లించేందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు.

mla
చెక్కులు అందుకుంటున్న కార్మికులు

By

Published : May 25, 2021, 8:33 AM IST

విశాఖలోని తుమ్మపాల చక్కెర కర్మాగారంలోని కార్మికుల సమస్యలను సీఎం.. ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఫ్యాక్టరీలోని రెగ్యులర్​, ఎన్​ఎంఆర్​, కాంట్రాక్టు కార్మికుల 27 నెలల జీతాలను చెల్లించారని తెలిపారు. ఇందుకు సంబంధించి రూ. 3,90,55,163 లను చెక్కు రూపంలో కార్మికులకు అందించారన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్​లో బకాయిలు చెల్లించే చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించినట్లు గుడివాడ పేర్కొన్నారు. జీతాలు పొందినందుకు కార్మిక సంఘం నాయకులు.. సీఎం, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details