ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల ప్రక్రియ.. తిరిగి చేపట్టాలి: సబ్బం హరి - జగన్​పై సబ్బం హరి కామెంట్స్ న్యూస్

ఎన్నికల ప్రక్రియ పూర్తిగా తిరిగి చేపట్టాలని మాజీ ఎంపీ, తెదేపా నేత సబ్బం హరి అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండి.. సాయం చేయాలన్నారు. అధికారంలో ఉన్న వారికి వైరస్ రాదేమోనని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రక్రియ.. తిరిగి చేపట్టాలి: సబ్బం హరి
ఎన్నికల ప్రక్రియ.. తిరిగి చేపట్టాలి: సబ్బం హరి

By

Published : Apr 8, 2020, 11:11 PM IST

Updated : Apr 8, 2020, 11:27 PM IST

కరోనా సాయం కింద.. వేయ్యి రూపాలయలు, బియ్యం ఇచ్చి ఓటేయాలనడం సరికాదని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. జగనన్న ఇచ్చాడు తీసుకోండి అంటూ చెప్పడమేంటని ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండల పరిధిలోని చేపల అన్నవరం గ్రామంలో తెదేపా నేతలు.. బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సబ్బం హరి హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీ హాజరై బియ్యం పంపిణీ చేసినపుడు అడ్డుకోని పోలీసులు ఇప్పుడేందుకు అడ్డుకున్నారని హరి ప్రశ్నించారు. నిన్న పంపిణీలో మంత్రినే జనం చుట్టుముట్టినా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇవాళ క్రమపద్ధతిలో పంపిణీ చేస్తున్నా.. అడ్డుకోవడం సరికాదన్నారు. ఏదైనా సాయం చేయాలనే.. తెదేపా శ్రేణులు బియ్యం పంపిణీ చేశారని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ.. తిరిగి చేపట్టాలి: సబ్బం హరి
Last Updated : Apr 8, 2020, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details