విశాఖ జిల్లా హుకుంపేట మండలం గడికించుమండలో పొలంలో నిల్వ ఉంచిన వరి కుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు తమ పొలాల్లో పండిన పంటను 9 కుప్పలుగా ఒకే దగ్గర పోశారు. సాయంత్రం వేళ వరికుప్పలకు మంటలు అంటుకున్నాయి. రైతులు మంటలార్పేందుకు యత్నించారు. అదుపు కాకపోవటం వల్ల పాడేరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాహనం పొలాల్లోకి వెళ్లే అవకాశం లేనందున బకెట్లతో నీళ్లు పట్టుకెళ్లి అగ్ని శిఖలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు ఆగలేదు. ధాన్యం పూర్తిగా దగ్ధమయ్యింది. దాంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అన్నదాతల కష్టం.. అగ్నికి ఆహుతి
రైతులు ఆరుగాలం కష్టపడ్డారు.. పంట పండింది.. కోత కోసి కుప్పలుగా పేర్చారు. సాయంత్రం వేళ కుప్పలకు నిప్పు అంటుకుంది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. అన్నదాతల కష్టమంతా అగ్నికి ఆహుతయ్యింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో జరిగింది.
అగ్నికి ఆహుతి