ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో వడగళ్ల వర్షం - andhra odisha border latest news

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గురువారం సాయత్రం ఉరుములు, మెరుపులుతో వడగళ్ల వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదన నిలిచిపోయింది.

rain on the andhra odisha border
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో వడగళ్ల వర్షం

By

Published : Feb 19, 2021, 11:56 AM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో వడగళ్ల వర్షం

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల ఓనకడిల్లి, మాచ్ ఖండ్ తదితర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ గాలులతో ఉరుములు, మెరుపులుతో వడగళ్ల వర్షం పడింది. వడగళ్ల వర్షం కారణముగా జీడీ మామిడి పువ్వు దెబ్బతింది.

భారీ వర్షాలు కారణంగా మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్తు ఉత్పాదన దాదాపు మూడు గంటలు నిలిచిపోయింది. గురువారం నుంచి ఓనకడిల్లి, మాచ్ ఖండ్, జోలాపుట్, పాడువ, లమతపుట్, నందపూర్ గ్రామాల్లో సెల్ సంకేతాలు కూడా నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details