ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెగిపడిన రైల్వే హెచ్‌టీ విద్యుత్తు తీగలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

విశాఖ-విజయవాడ రైలుమార్గంలో దువ్వాడ వద్ద.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు హెచ్‌టీ విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌లో.. పలు రైళ్లు గంటల తరబడి పలుచోట్ల నిలిచిపోయాయి.

Railway HT power cables severed at duvvada
తెగిపడిన రైల్వే హెచ్‌టీ విద్యుత్తు తీగలు

By

Published : Jun 6, 2022, 7:54 AM IST

తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌లో ఆదివారం పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ-విజయవాడ రైలుమార్గంలో దువ్వాడ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు హెచ్‌టీ విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు రైళ్లు గంటల తరబడి పలుచోట్ల నిలిచిపోయాయి.

ఆదివారం తెల్లవారుజామున 3.30కు విశాఖకు చేరుకున్న బిలాస్‌పూర్‌-తిరుపతి, 3.50కి వచ్చిన షాలిమార్‌-హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లు ఉదయం 8 గంటల వరకు స్టేషన్‌లోనే ఉండిపోయాయి. ఉదయం 6.20కి బయల్దేరాల్సిన విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ 8.30 తర్వాత పయనమైంది. విద్యుత్తు తీగలు పునరుద్ధరించి, నిలిచిపోయిన రైళ్లను ఉదయం 7.30 నుంచి ఒక్కొక్కటిగా పంపించారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు దాదాపు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details