ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడికాడలో నాణ్యత లేని మాస్కుల పంపిణీ - అరకొరగా మాస్కులు.. నాణ్యత అసలే లేదు

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం అందించిన మాస్కులను గ్రామ వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. అయితే నాణ్యతలేని, చిరిగిపోయిన మాస్కులు అందిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

vishaka district
అరకొరగా మాస్కులు.. నాణ్యత అసలే లేదు

By

Published : May 9, 2020, 9:30 PM IST

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం అందించే మాస్కులు నాణ్యత లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లు చిరిగిపోయినవి ఇస్తున్నారని వాపోయారు. ఒక్కొక్కరికీ మూడు మాస్కులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఒక్కొక్కటి మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు.

చిన్న పిల్లలకు పూర్తిగా మాస్కులు ఇవ్వలేదని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాణ్యమైన మాస్కులను అందించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే మాస్కులు పూర్తిస్థాయిలో వస్తే అందరికీ అందిస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details