విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినట్లే ఇచ్చి, కీలకమైన వాల్తేరు డివిజన్ ను విజయవాడ తరలించడంపై ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి.ఈ అంశంపై విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు,పౌర సమాజ ప్రతి నిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విశాఖలో వాల్తేరు డివిజన్ కేంద్రం లేకుంటే, కొత్త ప్రాజెక్టులు రావని వారు అభిప్రాయపడ్డారు. విశాఖ డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్, మార్షలింగ్ యార్డ్ వంటి కీలక వ్యవస్ధలు ఉండగా వాల్తేరు డివిజన్ కేంద్రాన్ని విజయవాడ తరలించడం సరికాదన్నారు. ఈనెల 26న విశాఖకు రానున్న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ ఆంగ్డే కు తమ నిరసనను తెలియజేస్తామని ప్రజాసంఘాలు నేతలు వెల్లడించారు.
విశాఖలోనే వాల్తేర్ డివిజన్ ఉండాలి:ప్రజాసంఘాలు
వాల్తేరు డివిజన్ ను విశాఖ జోన్ లోనే ఉంచాలని సిఐటీయు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది.
protest building up for waltair division in visakhapatnam