AP GOVERNMENT: విశాఖ వేదికగా జరిగిన సభలో ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వం సరైన ప్రకటన చేయించలేకపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన ఏ అంశాన్ని పట్టించుకోలేదు. రైల్వే జోన్ అంశం, ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను వేదిక నుంచే ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. పదే పదే ప్రధాని మోదీనీ సార్.. సార్..సార్ అంటూ సంబోధించిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి వీలైనంత ఆర్థిక సాయం అందించాలని ప్రాధేయపడ్డారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతీ రూపాయి రాష్ట్రానికి అవసరం అవుతాయన్నారు.
"ఎనిమిదేళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్. మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందటానికి వీలుగా.. మీరు సహృదయంతో, విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం. మీరు మా రాష్ట్రనికి ప్రత్యేకంగా ఇచ్చే సంస్థ.. మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర పుననిర్మాణానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సార్. విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు , విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసులో వాటినంన్నింటిని కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటు.. పెద్దలైన మీ ఆశీస్సులు."-ముఖ్యమంత్రి జగన్