విశాఖ జిల్లా జి.మాడుగులలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారి గోతులు మయమైందని సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడి బాబు గుర్తించారు. తరచు ప్రమాదాలకు రహదారి కారణమవుతుందని తెలుసుకున్నారు. స్థానిక కాంట్రాక్టర్ సహకారంతో మెటీరియల్ సేకరించారు. పోలీసులు, ఎస్సై ఉపేంద్ర, స్థానిక యువకులతో కలిసి సీఐ జీడి బాబు శ్రమదానం చేపట్టి...గుంతలను పూడ్చారు. ఎప్పుడూ తుపాకులతో ఉండే పోలీసులు ఒక్కసారిగా పారలు చేతబట్టి పనిచేయటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
లాఠీ పట్టే చేతులు...పారలు పట్టాయి - జి.మాడుగుల వార్తలు
ఎప్పుడూ తుపాకులు పట్టే పోలీసులు చేతులు పారలు పట్టాయి. గుంతలమయిమైన రహదారి పూడ్చే పని చేపట్టారు. పౌర సేవలో భాగంగా... విశాఖ మన్యంలో సీఐ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమదానం చేశారు.
లాఠీ పట్టే చేతులు...పారలు పట్టాయి
ఇదీ చదవండి: