గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జోలికి పోయి.. బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విశాఖ జిల్లా చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సయ్యుద్ అలియాస్ మహమ్మద్ ప్రజలకు సూచించారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడిలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలు మేరకు పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ మహమ్మద్, ఎస్.ఐ సంతోష్ సిబ్బందితో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంజాయి రవాణా అడ్డుకట్ట వేయడానికి గ్రామస్థులు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా యవత అసాంఘిక కార్యకలాపాలపైపు పెడదారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు.
బైలపూడిలో పోలీసుల పల్లె నిద్ర
విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడిలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దని చోడవరం సీఐ సూచించారు.
బైలపూడిలో పోలీసుల పల్లె నిద్ర