ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా అమ్ముతున్న వారిని పట్టుకున్న పోలీసులు - విశాఖ జిల్లా

విశాఖ జిల్లాలో నాటుసారా ఏరులై పారుతోంది. పోలీసులు ఎన్ని విధాలుగా హెచ్చరించినా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా.. దేవరాపల్లి, చీడికాడలో నాటుసారా అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.

vishaka district
నాటుసారా అమ్ముతున్న వారిని పట్టుకున్న పోలీసులు

By

Published : Jul 20, 2020, 7:01 PM IST

విశాఖ జిల్లాలో నాటుసారా అమ్మకాల పై పోలీసులు కన్నెర్ర చేశారు. దేవరాపల్లిలో నాటుసారా అమ్ముతుండగా.. సత్తిబాబు అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్లాస్టిక్ డబ్బాలోని 14 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ నరసింహ మూర్తి చెప్పారు.

చీడికాడ మండలంలోని మంచాలలో నాటుసారాతో ముగ్గురు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ సురేశ్ కుమార్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details