విశాఖపట్నం సాగర తీరంలో కొత్త మొక్కలు కొలువుదీరాయి. సన్ రే రిసార్ట్స్ సౌజన్యంతో బీచ్‌లో నౌపాక మెుక్కలను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు కలిసి నాటారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నౌపాక మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న ఆయన... వీటిని ఎక్కువగా పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు.
విశాఖ సాగరతీరానికి పచ్చని మణిహారం - విశాఖ సాగర తీరం
విశాఖ సాగర తీరానికి నూతన శోభ చేకూరనుంది. సన్ రే రిసార్ట్స్ ఆధ్వర్యంలో నౌపాకా మొక్కలను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు నాటారు.
విశాఖ సాగరతీరానికి పచ్చని మణిహారం
బీచ్‌కు వచ్చే పర్యాటకులకు ఈ మొక్కలు ఆహ్లాదాన్ని ఇస్తాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పర్యాటకానికి స్వర్గధామంగా విశాఖ మరింత శోభ సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మొక్కలను పెంచే బాధ్యత సన్ రే రిసార్ట్స్‌కు అప్పగించారు.
ఇదీచదవండి.