విశాఖలోని అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో వ్యాక్సిన్ కోసం ప్రజలు పాట్లు పడుతున్నారు. రెండో డోసు టీకా వేసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి వచ్చారు. అందుకు తగ్గట్టుగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేని కారణంగా నిరాశ చెందారు. టీకాలు లేవని చాలా మంది వెనుదిరిగారు. ఈ సమస్యపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
వ్యాక్సిన్ల కొరత... రెండో డోసు కోసం ప్రజల పాట్లు - వ్యాక్సిన్ల కొరత వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెండో డోసు టీకా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాలకు తరలివచ్చారు. కానీ సరిపడా టీకా డోసులు లేని కారణంగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
టీకాల కోసం వేచి ఉన్న ప్రజలు