ఆధార్‌లో తప్పుల సవరణ, ఫోన్ నెంబర్‌తో అటాచ్‌మెంట్ వంటి పనులు.. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. పాడేరు ఏజెన్సీలో గతంలో మూడు ఆధార్ కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కటి మాత్రమే ఉంది. ఇదే సమయంలో.. మహిళలు చేయూత పథకంలో లబ్ధి పొందటానికి ఆధార్ కార్డ్‌కు.. ఫోన్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పరిస్థితుల్లో.. సవరణలు, ఫోన్ నంబర్ల నమోదుకు ఆధార్ కేంద్రాల వద్ద మహిళలు తెల్లవారుజామున 4 గంటల నుంచే వందలాదిగా క్యూ కడుతున్నారు. కరోనా కాలంలో ప్రమాదాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఎక్కువ దరఖాస్తులు చేయలేకపోతున్నామని మీసేవా కేంద్రం నిర్వాహకులు చెబుతుండగా.. మరికొంత సమయం ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.