ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గరిష్ట స్థాయికి చేరుకున్న పెద్దేరు జలాశయ నీటి మట్టం

పెద్దేరు జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటిమట్టం 136.70 మీటర్లు... పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్లు ఉందన్నారు.

Large reservoir that has reached its maximum level
గరిష్ట స్థాయికి చేరుకున్న పెద్దేరు జలాశయం

By

Published : Dec 14, 2020, 2:19 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. జలాశయంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న అదనపు నీటిని ఒడిసి పడుతున్నారు. నీటిమట్టం గరిష్ట స్థాయి దాటితే... దిగువ నదిలోకి అదనపు నీటిని విడిచి పెడుతున్నారు. జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు అన్నారు. రానున్న రబీ సీజన్​కు సాగునీటికి.. వేసవిలో నీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 63 క్యూసెక్కుల అదనపు నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్ల కాగా...ప్రస్తుతం 136.70 మీటర్ల వద్ద ఉంది. నీటి మట్టం గరిష్టస్థాయి వద్ద నిలకడగా ఉందని...జలాశయం ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details