విశాఖ జిల్లా సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న సలహా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, డాక్టర్ సత్యవతి, దేవదాయ శాఖ కమిషనర్ సలహా కమిటీలో చేరుస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
పంచ గ్రామాల భూ సమస్య: సలహా కమిటీలోకి ఎంపీ విజయసాయి రెడ్డి - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లాలోని సింహాచలం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన సలహా కమిటీని విస్తరించింది. ఇందులో ఇద్దరు వైకాపా ఎంపీలు, దేవదాయ శాఖ కమిషనర్‌ను చేర్చింది.
pancha gramalu
దశాబ్దాలుగా మగ్గుతున్న సింహాచలం పంచ గ్రామాల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ సహా జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సభ్యులుగా సింహాచలం ఈవో సభ్య కన్వీనర్‌గా ఉన్నారు. ఇప్పుడు తాజాగా సలహా కమిటీలో అదనంగా ఎంపీలు, దేవాదాయ శాఖ కమిషనర్‌ను చేర్చారు.