ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలి' - విశాఖ జిల్లా వార్తలు

బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ...విశాఖలో జీవీఎంసీ మలేరియా విభాగం కార్మికులు ఆందోళన చేపట్టారు.

The outstanding salaries should be paid immediately.
'బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలి'

By

Published : Nov 6, 2020, 7:36 PM IST

బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ... విశాఖలో జీవీఎంసీ మలేరియా విభాగం కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు రెండో రోజుకు చేరాయి. కరోనా సమయంలో తమతో ఇష్టం వచ్చినట్లు పని చేయించుకున్న ప్రభుత్వం ఇప్పుడు తమను రోడ్డుపై పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవీఎంసీ గాంధీ పార్క్​లో ఇవాళ రెండో రోజు నిరవధిక దీక్షలు చేపట్టారు. బకాయి పడ్డ జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు వెంటనే చెల్లించాలని మలేరియా విభాగం కార్మికులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details