ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఉత్సాహంగా మందుబాబులు - Opening Liquor Shops

గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడం.. మందు బాబుల్లో ఉత్సాహాన్ని నింపింది. విశాఖలో మద్యం దుకాణాల వద్ద భారీ సంఖ్యలో క్యూ లైన్లు ఏర్పాటయ్యాయి. ఈ రోజు 11 గంటలకు మద్యం దుకాణాలు పోలీసుల ఆధ్వర్యంలో తెరుచుకున్నాయి.

vishakapatnam
క్యూ లైన్లో మందుబాబులు

By

Published : May 4, 2020, 12:17 PM IST

విశాఖలోని గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు పోలీసుల సమక్షంలో తెరుచుకున్నాయి. కొనుగోలు చేసేందుకు మందు బాబులంతా ఉదయం 10 గంటల నుంచే బారులు తీరారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మద్దిలపాలెం వద్ద గుంపులు గుంపులుగా గుమిగూడిన వారిని పోలీసులు చెదరగొట్టారు. దాదాపు 40 రోజులు పైగా మద్యం లభించక ఇబ్బందులు పడ్డ వారంతా.. ఇన్నాళ్లకు ఊరట పొందినట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details