ఏపీ ఒలింపిక్ సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి, అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్ ఎన్నిక చెల్లదని రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కేపీ రావు ఆరోపించారు. విశాఖలో మాట్లాడిన ఆయన...విజయసాయిరెడ్డి, కృష్ణ దాస్‌లకు లేని పదవులు సృష్టించి వారి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఒలింపిక్ సంఘం సభ్యుడైన పురుషోత్తం ప్రయత్నిస్తోన్నరని ఆరోపించారు. భారత ఒలింపిక్ చట్టం ప్రకారం ఈ ఎన్నిక చెల్లదని కేపీ రావు తెలిపారు. ఒలింపిక్ సంఘానికి ఛైర్మన్, అధ్యక్షుడు, ట్రెజరర్‌గా ఉండాలంటే ఆయా సంఘాల్లో సభ్యులై ఉండాలన్నారు. విజయసాయిరెడ్డి, కృష్ణదాస్‌లకు తెలియకుండా పురుషోత్తం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన విధంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కేపీ రావు అన్నారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘంలో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దాలని సీఎంను కోరారు.
'ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నిక చెల్లదు' - ఏపీ ఒలింపిక్ సంఘం
ఏపీ ఒలింపిక్ సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి, అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఎన్నిక చెల్లదని ఆ సంఘ కార్యదర్శి కేపీ రావు అన్నారు. కొందరు వ్యక్తులు లేని పదవులు సృష్టించి మోసానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి కేపీ రావు