ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఉపాధి హామీ పనుల్లో నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం'

By

Published : Oct 24, 2020, 8:16 AM IST

రానున్న ఆర్థిక సంవత్సరం చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులపై ఏపీడీ మణికుమార్.. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ, గ్రామ సచివాలయ ఉద్యోగుల శిక్షణా కార్యక్రమానికిక హాజరై పలు సూచనలు చేశారు. వ్యవసాయ, నీటి సంరక్షణలను ప్రత్యేకంగా పరిగణించాలన్నారు.

nregs apd instructing trainees
ఉపాధి హామీ ఏపీడీ సూచనలు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీడీ మణికుమార్ సూచించారు. విశాఖ జిల్లా చీడికాడ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, గ్రామ సచివాలయం సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పనుల గుర్తింపుపై పలు సూచనలు చేశారు.

రానున్న ఆర్థిక సంవత్సరం గుర్తించే పనుల్లో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీడీ కోరారు. గ్రామ సభలు నిర్వహించి.. ప్రజల సలహాలు తీసుకోవాలని సూచించారు. కూలీలు అందరికీ పని కల్పించాలని చెప్పారు.

ఇదీ చదవండి:రూ. 41 లక్షలతో శారదా నది కాజ్​ వే పనులు

ABOUT THE AUTHOR

...view details