Silver Jubilee Hostel Problems in Kurnool : అది ఎంతో ప్రతిష్ఠాత్మక కళాశాల. ఆ కాలేజీలో సీటు దొరికితే ఎంతో అదృష్టంగా భావిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న కళాశాలకు చెందిన వసతిగృహం మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. అలాంటి కాలేజీ హాస్టల్లో పురుగుల అన్నం మాత్రమే దొరుకుతుంది. నీళ్లు లేని అపరిశుభ్ర బాత్ రూంలతోనే సర్దుకోవాలి. దోమలు, పాములు, పందులతో భయంభయంగా కాలం గడపాల్సి వస్తోంది.
అమరావతి ORRప్రాజెక్ట్ - CRDAగేమ్ ఛేంజర్, మీ ఊరు నుంచి వెళ్తుందా? - Amaravati Outer Ring Road
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. ఇక్కడ సీటు కోసం విద్యార్థులు చాలా కష్టపడతారు. అడ్మిషన్ వచ్చిందంటే అదృష్టంగా భావిస్తారు. తెలుగురాష్ట్రాలకు చెందిన చాలామంది ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడి విద్యార్థుల నుంచి నెలకు 4 వేల రూపాయల చొప్పున హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నా, నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. పురుగుల అన్నం, రుచీపచీ లేని సాంబార్, ఈగలతో కూడిన ఉప్మా వడ్డిస్తున్నారు.
కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతుండటంతో ఒక్క పూటా కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నారు. దుర్వాసన వస్తోన్న ఆహారం తీసుకోవటం వల్ల తరచూ విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. జ్వరం వచ్చినా బాగోగులు చూసుకునే వారే లేకపోవడం వల్ల విద్యార్థులే సొంత ఖర్చులతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో రోడ్డెక్కారు. గోడు వినాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
భాగ్యనగరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం - భారీగా తరలివచ్చిన పసుపుదళం - CHANDRABABU RALLY
కళాశాల, హాస్టల్ ప్రాంగణాలు కూడా సమస్యల ఆవాసంగా మారాయి. డైనింగ్ హాల్ కూడా అధ్వానంగా ఉంది. నీటి పైపులు పాడయ్యాయి. అపరిశుభ్ర వాతావరణంతో దోమలు, పందులు, పాములు, ఎలుకలు గదుల్లోకి చొరబడుతుంటాయి. ప్రస్తుతం బాలుర హాస్టల్ లో 250 మంది, బాలిక హాస్టల్ లో 450 మంది ఉన్నారు. బాలికల హాస్టల్‌లో ఒక్కో గదిలో 25 నుంచి 30 మంది ఉండాల్సి వస్తోంది. బాత్ రూంలు సరిపడా లేక అవస్థలు తప్పటం లేదు. ఒక్కోసారి రెండ్రోజులైనా మరుగుదొడ్లలోకి నీరు రాక విద్యార్థినులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.
2023 విద్యా సంవత్సరం నుంచి సిల్వర్ జూబ్లీ కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లిపోయింది. నాటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయని విద్యార్థులు చెబుతున్నారు. నెలనెలా ఫీజులు కడుతున్నా కనీస వసతులు కల్పించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలంటూ క్లస్టర్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ను నిలదీస్తున్నారు.
నాడు-నేడు పనులకు చెల్లించని బిల్లులు - అసంపూర్తి పనులతో విద్యార్థులకు ఇక్కట్లు