ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆవులకు మేత లేదు.. దయచేసి స్పందించండి' - విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో ఆవులు

తమ ఆశ్రమంలో ఉన్న గోవులు మేతలేక చిక్కిపోతున్నాయని.. ఎవరైనా దాతలు స్పందించి వాటికి గ్రాసం అందజేయాలని.. విశాఖ హనుమంతవాకలోని జ్ఞానానంద సాధు ఆశ్రమ నిర్వాహకులు కోరారు. నిధుల లేమితో గోమాతలకు మేత అందించడం కష్టమవుతోందన్నారు.

no fodder to cows in gnaananda ashram in vizag
'ఆవులకు మేత లేదు.. దయచేసి స్పందించండి'

By

Published : May 14, 2020, 8:50 PM IST

విశాఖలోని హనుమంతువాక వద్ద ఉన్న జ్ఞానానంద సాధు ఆశ్రమంలో ఉన్న గోవులకు ఎవరైనా దాతలు గ్రాసం అందించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. లాక్ డౌన్ వల్ల నిధుల లేమితో గోమాతలకు మేత దొరకడం కష్టమైందన్నారు. గోశాలలో ఉన్న 52 ఆవులు ఆహారం లేక చిక్కిశల్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనసున్న దాతలు స్పందించి సహాయం చేయాలని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details