భారత్, సింగపూర్, ధాయ్ లాండ్ నౌకాదళ సంయుక్త విన్యాసాలు సిట్మెక్స్ ఆరంభమైంది. అండమాన్ సముద్రంలో రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు జరనున్నాయని నౌకా దళ అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా నాన్ కాంటాక్ట్, ఎట్సీ ఓన్లీ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. మూడు నౌకాదళాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, అంతర్జాతీయ జలాల్లో శాంతి పరిరక్షణ సహా బహుముఖ ఆపరేషన్లలో సామర్ద్యం పెంచుకునేందుకు.. ఈ విన్యాసాలు ఉపకరించనున్నాయి.
భారత నౌకాదళం నుంచి రెండు యుద్ద నౌకలు కమోర్టా, కార్ముఖ్ పాల్గొంటున్నాయి. సింగపూర్ నేవీ నుంచి ఇట్రపిడ్, ఎండీవర్ లు పాల్గొనగా.. ధాయ్ లాండ్ నుంచి క్రబూరి నౌక ఇందులో తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. 2018లో భారత ప్రధాని సింగపూర్, థాయ్ పర్యటనల సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మూడు దేశాల మధ్య సిట్మెక్స్ పేరిట ప్రతి ఏటా విన్యాసాలు చేపడుతున్నారు.