విశాఖ మన్యంలోని పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. ముఖ్యంగా పాడేరు సమీపంలోని వంజంగి కొండపై మంచు అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. మేఘాలు నేలజారాయా అన్నట్టు కొండలపై మంచు తెరలు తేలియాడాయి. వర్షాకాలంలోనూ ఇవి కనువిందు చేస్తున్నాయి. లాక్డౌన్ నుంచి సడలింపులు రావటంతో ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. సహజసిద్ధమైన ఈ అందాలను చూసి మైమరచిపోతున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.
మంచు తెరల అందం... నయనానందం
విశాఖ మన్యంలోని వంజంగి కొండపై మంచు తెరల అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించటంతో ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. సహజసిద్ధమైన అందాలను చూసి పులకించిపోతున్నారు.
Vanjangi Hill
గతంలో గిరిజనులకు డోలీ కష్టాలు అంటూ ఈటీవీ కథనం ప్రసారం చేయటంతో వంజంగి కొండపై ఎనిమిది కిలోమీటర్ల మేర ఘాట్ రహదారి నిర్మించింది ప్రభుత్వం. దీనివల్ల పర్యాటకులకు సైతం ఇబ్బందులు తప్పాయి. నేరుగా వాహనాల్లో కొండపైకి వెళుతున్నారు. వేకువజాము నుంచి ఈ రమణీయ దృశ్యాలు వీక్షించేందుకు పోటీ పడుతున్నారు.