ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేటు అధ్యాపకులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి'

కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు సైతం ఎక్కడికక్కడే మూతవేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​ ప్రైవేట్ కళాశాలల అధ్యాపకుల యూనియన్ డిమాండ్ చేసింది.

'ప్రైవేటు అధ్యాపకులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి'
'ప్రైవేటు అధ్యాపకులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి'

By

Published : Aug 4, 2020, 12:25 AM IST

'ప్రైవేటు అధ్యాపకులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి'

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ ప్రైవేటు కళాశాలల అధ్యాపకుల యూనియన్ సమావేశం నర్సీపట్నం మండలం బలిఘట్టం సమీపంలోని ఉత్తర వాహిని ప్రాంగణంలో ఏర్పాటు అయింది. విశాఖ జిల్లా ప్రైవేట్ కళాశాలల లెక్చరర్ల యూనియన్ కన్వీనర్ లోకనాథం ముఖ్యఅతిథిగా హాజరై పలు సమస్యలపై చర్చించారు. కరోనా నేపథ్యంలో మార్చి నెల మొదలుకొని జూలై చివరి వరకు ప్రైవేటు అధ్యాపకులు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించి ఆర్థిక సాయం చేయాలని సమావేశం తీర్మానం చేసింది. దీనికితోడు కరోనా వైరస్ నిర్మూలనలో అధ్యాపకులుగా తమ వంతు బాధ్యత నిర్వర్తించే అందరూ ఆయా గ్రామాల్లో కృషి చేయాల్సిన అవసరం ఉందని సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

కరోనా కారణంగా అధ్యాపకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ యాజమాన్యాలు ఆదుకోవాలని పేర్కొన్నారు. ఆ తర్వాత నర్సీపట్నం డివిజన్ అధ్యాపకుల యూనియన్ నూతనంగా ఏర్పాటైంది. ఇందులో అధ్యక్షునిగా ఈశ్వరరావు, ఉపాధ్యక్షునిగా వి సత్యనారాయణ, కార్యదర్శిగా దేవుడు నాయుడు, సహాయ కార్యదర్శిగా వి శేష్ కుమార్, కోశాధికారిగా రాజా, కార్యనిర్వాహక సభ్యులుగా మరో ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇవీ చదవండి

పాజిటివ్ కేసుల్లో 12,500 మార్క్​ను దాటేసిన విశాఖ జిల్లా

ABOUT THE AUTHOR

...view details