ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు: నారా లోకేశ్‌ - TDP National General Secretary Nara Lokesh

Nara Lokesh on VSP movement: విశాఖ ఉక్కు కార్మికులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సంకల్పానికి నిదర్శనమని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని తెలిపారు. ప్రజలు ఐక్యంగా ఉండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పేర్కొన్నారు.

Nara Lokesh on VSP movement
Nara Lokesh on VSP movement

By

Published : Feb 12, 2022, 11:47 AM IST

Nara Lokesh on VSP movement: విశాఖ ఉక్కు కార్మికులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తెదేపా వ్యతిరేకిస్తోందన్నారు. అసెంబ్లీ నుంచి పార్లమెంటు వరకు తెదేపా ఏడాది పొడవునా... నిరసన గళం వినిపిస్తూనే ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సంకల్పానికి నిదర్శనమని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని తెలిపారు. ప్రజలు ఐక్యంగా ఉండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పేర్కొన్నారు.

ప్రైవేటీకరణపై సీఎం మాట్లాడకపోవడం బాధాకరం..

విశాఖ ఉక్కు ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం జగన్, వైకాపా ఎంపీలు మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని తెలిపారు.

ఈ నెల 13న జైల్‌భరో...

Vizag Steel plant movement: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా... కూర్మన్న పాలెంలోని శిబిరం వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త మద్దతు కూడగట్టామన్న కార్మిక సంఘాల నేతలు.. కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో.. ఈ నెల 13 న జైల్‌భరో నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం..నేటికి ఏడాది

ABOUT THE AUTHOR

...view details